కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడిని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు.
ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక సభలో కాంగ్రెస్ హామీలపై నిలదీస్తున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు. ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అధికారిక క్యాంప్ కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. అంతటితో ఆగకుండా కార్యాలయ సిబ్బందిపైనా దాడికి ప్రయత్నించారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పెట్టడంతో పాటు అక్కడ ఉన్న ఫర్నిచర్, కిటికీల అద్దాలను పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దాడికి నిరసనగా సోమవారం గజ్వేల్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది