వరంగల్ : కేసీఆర్ కీర్తిని దిగజార్చాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ నోటీసులు జారీ చేసిందని మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ తెచ్చిన ధీరుడికి కేసులు, కొట్లాట, కోర్టులు కొత్తకాదు అన్నారు.
గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడిన వీరుడు కేసీఆర్. ఈ కాంగ్రెస్ నేతల సిట్, బొట్లకు భయపడబోరన్నారు. న్యాయస్థానాల మీద, వ్యవస్థ మీద నమ్మకం ఉందన్నారు. కమిషన్లు, సిట్లు, కేసులులకు అదరం బెదరమన్నారు.