హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ) : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రెండుసెట్ల నామినేషన్ పత్రాలను దాసోజు శ్రవణ్ అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు, సునీతా లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు వెంకట్రాంరెడ్డి, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.