హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ రోజున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను (BR Ambedkar) కాంగ్రెస్ సర్కార్ ఘోర అవమానించింది. సచివాలం వద్ద ఉన్న 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని కాంగ్రెస్ పాలకులు పట్టించుకోలేదు. అంబేద్కర్ విగ్రహం పరిసరాలను కూడా శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించింది. రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. దీంతో లోపలికి వెళ్లకుండా నిర్వాహకులు గేటులుకు తాళాలు వేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు వద్ద భైటాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించేందుకు వస్తే అడ్డుకున్నారని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగించాలనే ఉద్దేశంతో సచివాలయం వద్ద గత కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటుచేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్షన్ మనస్తత్వంతో కేసీఆర్‌పై ఉన్న కోపంతో అంబేద్కర్‌ను అవమానిస్తున్నారు. చారిత్రక విగ్రహం పరిసరాలను కూడా శుభ్రం చేయలేదన్నారు. దండేయాలన్న కనీస సోయి కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు.
అంబేద్కర్‌కు రేవంత్ రెడ్డిచేస్తున్న అవమానాన్ని చూస్తే బాధకలుగుతున్నదని చెప్పారు. దేశంలో సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు లభించాయంటే దానికి కారణం భారత రాజ్యాంగం. గణతంత్ర దినోత్సవం రోజున భారత రాజ్యాంగ నిర్మాతకు ఇంత అవమానం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. విగ్రహాలకు దండలు కూడా వేయరా అని నిలదీశారు. అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి బందీ చేశాడని మండిపడ్డారు. పాలకులు వస్తారు పోతారు.. అంబేద్కర్ చిరకాలం ఉంటారన్నారు. కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ విగ్రహాన్ని పట్టింకోని రేవంత్ రెడ్డి.. సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
LIVE : BRS leaders speaking at Dr. B. R. Ambedkar’s statue at Tank Bund. https://t.co/Vx6QpdIFr2
— BRS Party (@BRSparty) January 26, 2025