హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగు లపై సీఎం రేవంత్రెడ్డి నీతిమాలిన వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి చిరు ఉద్యోగులపై సీఎం నిర్లజ్జగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ హయాంలో లేని కరెంటు కోతలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయో స్పష్టత ఇవ్వకుండా, చిరుద్యోగులపై నెపం వేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి తానేది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవటం దారుణమని ధ్వజమెత్తారు. సీఎం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.