హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బాధ్యతాయుతమైన పరిపాలకుడు ఎలా ఉంటాడో సీఎం రేవంత్‌రెడ్డికి నేర్పాలని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ విషప్రచారం మానుకోవాలని బుధవారం ఆయన ఎక్స్ వేదికగా హితవుపలికారు.
ప్రతిపక్ష నేత కనబడుటలేదని మెట్రో పిల్లర్‌పై కేసీఆర్ పోస్టర్ అతికించడంపై దాసోజు ఫైర్ అయ్యారు. నీచమైన, దారుణమైన ప్రయత్నానికి తెలంగాణ సీఎంవో ఒడిగట్టిందని విమర్శించారు. కేసీఆర్‌పై కన్నా వరద సహాయక చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కు వ శ్రద్ధ పెట్టాలి కదా? అని ప్రశ్నించారు.