హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. అసెంబ్లీలో సర్కార్ తీరును తప్పుపడుతూ.. పెట్టుబడులకు ప్రోత్సాహమేది? అంటూ ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మాట్లాడిన దానం నాగేందర్.. ‘నా మిత్రుడు సంజయ్ గోయల్ తెలంగాణలో కంపెనీ పెట్టాలనుకున్నారు. ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న సంస్థ మన దగ్గరికి వచ్చేందుకు సిద్ధపడింది.
సీఎంతో వాషింగ్టన్ డీసీలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించా. కానీ ప్రోత్సాహం లేక వెనక్కి వెళ్లిపోయారు. ప్రభుత్వం ప్రోత్సహించకపోతే కంపెనీలెలా వస్తాయి’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని చురకలంటించారు. దానం ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తుండగా.. మంత్రి శ్రీధర్‌బాబు వారించే ప్రయత్నం చేశారు. అయినా దానం ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.