హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): చెరువుల హద్దులను నిర్ణయించేందుకు చర్యలు చేపట్టామని, వాటి పరిరక్షణ కోసం కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
శాసనమండలిలో శుక్రవారం.. చెరువుల పరిక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఎఫ్టీఎల్ హద్దుల్లో ఆక్రమణలను ఉపేక్షించబోమని, ఇప్పటికే సుమా రు 44 వేల చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తయిందని తెలిపారు.