బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అట్టేపల్లి రామప్రభుతో పాటు పలువురు నేతలు
కొండాపూర్, సెప్టెంబర్11 : ప్రజా సమస్యలపై పోరాటాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అట్టేపల్లి రామప్రభు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్ ఆధ్వర్యంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రజా సేవలో ముందుండే వారికి గులాబి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలంటూ నూతనంగా చేరిన నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
రామప్రభుతో పాటు అడప అజయ్, సోంటెనా గంగాధర్, రాజు, రాజేష్, శ్రీశైలం, ఏఆర్పీ టీమ్ సభ్యులు బీఆర్ఎస్లో చేరారు. ప్రజా సేవను మరింత విస్తృతం చేసేందుకు రాజకీయ వేదిక అవసరమనే ఉద్దేశంతోనే పార్టీలో చేరినట్లు రామప్రభు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మారబోయిన రవికుమార్ యాదవ్, కలిదిండి రోజా, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్ పాల్గొన్నారు.