హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అత్యాధునిక సాంకేతికతో డిజిటల్ తరగతులు నిర్వహించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా 4,140 మంది వి ద్యార్థులు ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మెడికోలకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పెంపొందించాలని, ఇందుకోసం తరగతి గదుల్లో స్మార్ట్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్లు, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు.