హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సుంకరి భిక్షంగౌడ్ ఎన్నికయ్యారు. శుక్రవారం నారాయణగూడలోని సంఘం కార్యాలయంలో 33 జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శుల సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు.
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, గుండు లక్ష్మణ్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షప్రధాన కార్యదర్శుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర అడిట్ కమిటీ చైర్మన్‌గా సోమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, మ హేందర్‌రెడ్డి, జగన్మోహన్గుప్తా పాల్గొన్నారు.