ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలపై మాట్లాడుతూ, డీమ్డ్ యూనివర్సిటీలు మాత్రం యూజీసీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని చెప్పారు.
కొత్తగా వర్సిటీలకు ప్రభుత్వం భూమి కేటాయించలేదని స్పష్టంచేశారు. ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోతున్నదని సీపీఐ పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు.