హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో పనిచేసే వైద్య సిబ్బందికి భద్రత పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మహిళా డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, సిబ్బందికి రక్షణగా షీ టీమ్లతో రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు.
ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో భద్రత బలోపేతంపై సుప్రీంకోర్టు నిబంధన మేరకు సోమవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బందిపై దాడుల నియంత్రణకు 2008 చట్టంపై చర్చించారు.