హైదరాబాద్ : అట్టడుగున ఉన్న వారికి అత్యున్నత ఆసరా ‘తెలంగాణ దళితబంధు’ పథకమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. సీఎం దురదృష్టికి దళితబంధు పథకం నిదర్శనం. దళితబంధు తెలంగాణ చరిత్రను తిరగరాసే పథకం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితబంధు పథకం కింద రూ. పదిలక్షల ఆర్థిక సాయం ఇవ్వడమే కాదు.. ప్రభుత్వ కాంటాక్టులూ, వ్యాపార లైసెన్సుల్లోనూ దళితులకు కోటా ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమం కావడం తెలంగాణకే గర్వకరాణమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఈ సామాజిక న్యాయ విప్లవం మునుముందుకు సాగుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు.