టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్యక్తంచేసింది. ఇందుకు కృతజ్ఞతగా మంగళవారం రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించనున్నట్టు వెల్లడించింది. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్ సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సీఎం నిర్ణయం వల్ల తెలంగాణలోని 40 వేల మంది ఎస్సీ ఉద్యోగులకు లబ్ధిచేకూరుతుందని చెప్పారు. ఈ పథకం రాబోయే రోజుల్లో దేశానికి దారి చూపుతుందన్నారు.
సీఎం కేసీఆర్ను చూసి భరతజాతి గర్విస్తున్నది
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ను చూసి భరతజాతి గర్విస్తున్నదని టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దళితబంధుతో దళితుల జీవితాల్లో మార్పు తీసుకొస్తారని పేర్కొ న్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని పెంచే యజ్ఞానికి సీఎం కేసీఆర్ పూనుకున్నారని టీఆర్ఎస్ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు తెలిపారు.