Vikarabad | బషీరాబాద్, ఆగస్టు 15: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధిలోని కాశీపూర్‌కు చెందిన ఓ బాలికను నరేశ్ 3 నెలల క్రితం (మే 2వ తేదీన) ఎక్కడికో తీసుకెళ్లాడు. మే 5న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నరేశ్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నరేశ్ ఆచూకీ తెలపాలని తల్లి కళావతిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించుకొని వేధిస్తున్నారు. తనకు తెలియదని చెప్తున్నా పట్టించుకోకుండా కొ ట్టారని బాధితురాలు తెలిపింది. కాళ్లు, చేతులపై లాఠీతో కొట్టారని, దాంతో నడవలేకపోయానని చెప్పింది.
కొడుకు ఆచూకీ చెప్పకపోతే గన్నుతో కాల్చివేస్తానని ఎస్సై బెదిరించినట్టు వెల్లడించింది. మూడు నెలల నుంచి ప్రతి రోజు పోలీస్‌స్టేషన్‌కు రప్పిస్తున్నారని ఆవేదన వ్య క్తం చేసింది. కూలిపనులు చేస్తే గానీ పు టగడవని తనను పోలీసులు ఇలా ఇ బ్బందులు పెట్టడం తట్టుకోలేకపోతున్నానని, ఒక్కసారిగా చంపేస్తే కొడుకు కోసం చనిపోయిందన్న పేరైనా ఉం టుందని కన్నీరుమున్నీరవుతున్నది.