తిమ్మాపూర్, అక్టోబర్ 27: కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ నేత రాజీనామా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. దళిత నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 32 ఏండ్లపాటు సొంత ఖర్చుతో పార్టీకి సేవలందించారు. పార్టీ పటిష్ఠత కోసం పని చేసినా టికెట్ దక్కక పోవడంతో మనస్తాపానికి గురయ్యారు.
శుక్రవారం ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాయడం కలకలం రేపింది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధమని నాగరాజు తన లేఖలో పేర్కొన్నారు. తనను కాదని ఇటీవల పార్టీలో చేరిన ఆయనకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధిష్ఠానం తీరు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.