కరీంనగర్ కలెక్టరేట్, నవంబర్ 18 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన దళిత మహిళ మేకమల్ల సుగుణకు జమ్మికుంటలోని సర్వే నంబర్ 761లో భూమి ఉన్నది. అది తమదేనంటూ ఓ ప్రభుత్వ అధికారి తప్పుడు రికార్డులతో కాజేసే ప్రయత్నం చేయ గా, సుగుణ కోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ జరుగుతుండగానే సదరు అధికారి తన పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, గతంలో జరిగిన ‘ప్రజావాణి’లో బాధిత కుటుంబ సభ్యులు ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు.
ఆత్మహత్యకు పాల్పడితే న్యాయం జరుగుతుందేమోనన్న ఆ లోచనతో పురుగుల మందు డబ్బా తో కలెక్టరేట్లో ‘ప్రజావాణి’కి వచ్చా రు. దీంతో పోలీసులు డీఆర్వో వద్ద కు తీసుకెళ్లారు. సుగుణ భర్త, కూతు రు, కొడుకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని డీఆర్వోకు వివరించగా, వెంటనే అధికారులకు ఫోన్ చేసి, సమస్యను పరిష్కరించాలని ఆదేశించడంతో వారు వెనుదిరిగారు.