హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల సంబురాలు ఆకాశన్నంటాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితుల్లో సరికొత్త స్ఫూర్తిని రగిలిస్తోంది. వెలివాడల బతుకులకు ఆర్థిక పునర్జీవనాన్ని కల్పించి దళిత సోదరులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేసేందుకు సీఎం కేసీఆర్ దళిత యజ్ఞానికి పూనుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు కేటాయించడంతో దళితవాడల్లో సంబురాలు అంబరన్నంటుతున్నాయి. అందమైన రంగవల్లులు, డప్పుచప్పుళ్లు, ఆటపాటలతో తెలంగాణలోని దళిత లోగిళ్లు సరికొత్త ఉషోదయంతో వెలుగులు పంచుకుంటున్నాయి. చారిత్రాత్మక సందర్భానికి తెరలేపిన దళితోద్ధారకుడు సీఎం కేసీఆర్కు ఎల్లవేళలా అండగా ఉంటామని దళిత పల్లెలు శపథం చేస్తున్నాయి.