e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 2, 2021
Home News ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ద‌ళిత బంధు.. నిన్న కూలీలు.. నేడు య‌జ‌మానులు

ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ద‌ళిత బంధు.. నిన్న కూలీలు.. నేడు య‌జ‌మానులు

తలా ఓ యూనిట్‌తో దళితుల్లో సాధికారత
కమలాపూర్‌లో 3,788 మందికి 10 లక్షలు

నాంపల్లి రాజేందర్‌.. కనకం రవీందర్‌.. మాట్ల సుభాష్‌.. నిన్నటివరకూ కూలీలు. బతుకుపోరులో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. జీవితసాగరాన్ని ఈదడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పుడు వారే ఇతరులకు పని కల్పించే స్థితికి చేరుకున్నారు. ఒకరు డెయిరీ ఫాంకు యజమాని అయిపోగా, మరొకరు సెంట్రింగ్‌ కాంట్రాక్టర్‌ అయ్యారు. ఇంకొకరు సొంతంగా ట్రాక్టర్‌ కొనుక్కొని స్వయం ఉపాధిని పొందుతున్నారు. రాత్రికి రాత్రే జరిగిన ఈ మార్పుకు కారణం
దళితబంధు. ఈ పథకం ఎంతోమంది జీవన చిత్రాన్ని మార్చివేస్తున్నది.

- Advertisement -

వరంగల్‌, సెప్టెంబర్‌ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితుల అభ్యన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పథకం ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. పేదరికంలో మగ్గిన దళితవాడలకు కొత్త కళను తెస్తున్నది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఇప్పటికే పలు రాష్ర్టాలకే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సైతం మార్గదర్శకంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకంతో సంచలనమే సృష్టించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పంద్రాగస్టు నాడు హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. నాటి నుంచి దళిత సాధికారత వేగంగా ముందుకు సాగుతున్నది. అధికార యంత్రాంగం ఊరూరా సర్వేలు చేసి ప్రతి దళిత కుటుంబానికి సాయం అందిస్తున్నది. అర్హులైన ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతాలో రూ.9.90 లక్షలు వచ్చి పడతున్నాయి. మిగిలిన రూ.10వేలు రక్షణ నిధి కింద జమచేస్తున్నారు.

సొంతంగా యూనిట్లు..

హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలో దళితబంధు లబ్ధిదారులు ఒక్కొక్కరుగా సొంతంగా యూనిట్లు ప్రారంభిస్తున్నారు. మండలంలో మూ డున్నర వేలకుపైగా ఉన్న దళిత కుటుంబాలు ప్రభు త్వం ఇచ్చిన పెట్టుబడితో దీర్ఘకాలిక ఉపాధి పనులను మొదలుపెడుతున్నారు. ఇప్పటికే మూడు కుటుంబాలు అందరికంటే ముందువరుసలో ఉన్నాయి.

కమలాపూర్‌ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాంపల్లి రాజేందర్‌ వ్యవసాయ కూలీగా పని చేసేవారు. దళితబంధుతో సొంతంగా డెయిరీని ప్రారంభిస్తున్నారు. పాడి పోషణలో తనకున్న అనుభవంతో డెయిరీని నిర్వహించగలనన్న విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే బర్ల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. హర్యానాకు వెళ్లి బర్లను కొనుగోలు చేశారు. అవి రెండుమూడు రోజుల్లో తన ఇంటికి రానున్నాయి. అప్పటిలోగా డెయిరీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

కన్నూరుకు చెందిన కనకం రవీందర్‌ తనకు అనుభవం ఉన్న రంగంలోనే స్థిరపడుతున్నారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్‌ కొనుగోలు చేశారు. ట్రాక్టర్‌తో స్వయం ఉపాధిని పొందాలని భావిస్తున్నారు. నిన్నటిదాకా డ్రైవర్‌గా పనిచేసిన రవీందర్‌ ఇప్పుడు సొంత ట్రాక్టర్‌ను వ్యవసాయంలో కిరాయి ప్రాతిపదికన సాగుపనులకు, సరుకు రవాణాకు ఉపయోగిస్తున్నారు.

అందరి కంటే ముందుగా కమలాపూర్‌కు చెందిన మాట్ల సుభాష్‌ ఇంటిని దళితబంధు వరించింది. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా చెక్కును అందుకున్న సుభాష్‌ సెంట్రింగ్‌ ఓనర్‌గా మారారుడు. ఇన్నేండ్లు సెంట్రింగ్‌ పనిలో కూలీకి పోయే సుభాష్‌, ఇప్పుడు మరికొందరికి పని కల్పిస్తున్నారు. కులపోళ్లతో కలిసి ఏదో ఓ కార్యానికి డప్పు కొట్టే సుభాష్‌ ఇంటికి దళితబంధు కొత్త సందడి తెచ్చింది.

కొత్త జీవితం మొదలుపెడ్త

ఇంటిల్లిపాది పని చేసోటోళ్లం. నాకు గుంట భూమి లేదు. పని చేసుకుంటేనే గడిచే బతుకులు మాయి. సీఎం కేసీఆర్‌ నాలాంటోళ్లకు పది లక్షలు ఇస్తాండు అంటే మొదట్ల నేను అస్సలు నమ్మలే. పైసలు పడ్డయని ఫోన్లో మెసేజ్‌ చూసినంకనే నమ్మిన. ఇగ మా ఇబ్బందులు తీరినట్లే. కేసీఆర్‌ ఇచ్చిన పైసలతో కొత్త జీవితం మొదలెడ్త. కేసీఆర్‌ సారుకు జీవితాంతం రుణపడి ఉంట. – నాంపల్లి రాజేందర్‌, శనిగరం,కమలాపూర్‌ మండలం,హనుమకొండ జిల్లా

ప‌ది మందికి ప‌ని ఇప్పిస్త‌..

నేను చిన్నప్పటి నుంచి కూలీకి పోతున్న. పార పనికి పోయోటోన్ని. డప్పు కొట్టేటోన్ని. పదేండ్లుగా సెంట్రింగ్‌ పనికి పోతున్న. దళితబంధు పైసలతో సెంట్రింగ్‌ సామాను కొనుకున్న. బిల్డింగులకు సెంట్రింగ్‌ బిగిస్తున్న. ఇప్పుడు నేనే పది మందికి పని ఇప్పిస్త. ఇదంత కేసీఆర్‌ సారు దయ. – సుభాష్‌, కమలాపూర్‌, హనుమకొండ జిల్లా

కొత్త ట్రాక్టర్‌తో జీవితం బాగువడ్తతి


నలభై ఏండ్లు ట్రాక్టరు డ్రైవర్‌గ పనిచేసిన. ట్రాక్టర్‌కు ఓనర్‌ అయితనని జన్మల కూడ అనుకోలే. మాటల్లో చెప్పలేకపోతున్న. కేసీఆర్‌ సారు ఇచ్చిన పైసలతో కొత్త ట్రాక్టరు కొన్న. ముఖ్యమంత్రి సారుకు దండాలు. పిల్లల్ని మంచిగ సదివించుకుంట. -కనకం రవీందర్‌, కన్నూరు, కమలాపూర్‌ మండలం, హనుమకొండ జిల్లా

దళితుల అభ్యున్నతికే దళితబంధు

దళితులను ఉన్నతస్థాయికి తీసుకురావడమే దళితబంధు లక్ష్యం. ఈ పథకం అమలుకోసం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలాన్ని 12 కస్టర్లుగా విభజించాం. 32మంది అధికారులతో బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతి ఊరిలో పారదర్శకంగా సర్వే చేపట్టాం. పథకం కింద ఇప్పటివరకు 3,788 మంది లబ్ధిదారులకు కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వారి అకౌంట్లో జమచేశాం. లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేస్తున్నం. దళితబంధుతో దళితులు జీవితంలో చకగా స్థిరపడాలి. దళిత సాధికారత సాధించాలి. – రాజీవ్‌గాంధీ హనుమంతు, హనుమకొండ కలెక్టర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement