జమ్మికుంట/కరీంనగర్ : దళిత బంధు ఒక స్కీం కాదు. అది ఒక ఉద్యమం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ మహానేత, దళిత జాతి సముద్ధరణకు ‘దళితబంధు’ తెచ్చి వెలుగులు ప్రసరింపజేస్తున్నారని కొనియాడారు. దళిత బంధును పైలెట్ ప్రాజెక్టుగా హూజూరాబాద్ నియోజకవర్గంలో అమలు పర్చేందుకు రూ.500 కోట్లు విడుదల చేయడంపై కొప్పుల సీఎంకు దళితులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద దళితులు పెద్ద సంఖ్యలో హాజరై మిఠాయిలు పంచి, పటాకులు కాల్చారు.
జై తెలంగాణ, జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత బంధు ఒక పథకం కాదని, ఉద్యమం అని, దీనిని మున్ముందుకు తీసుకుపోతామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తరతరాలుగా చీకట్లో మగ్గిన దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెచ్చిన ఇలాంటి పథకం దేశంలో ఇప్పటివరకు లేదన్నారు. దేశ ప్రజలందరూ మరోసారి తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనలు, కార్యదీక్ష, సుపరిపాలనను ప్రశంసిస్తున్నారన్నారు.
నిన్నటి దాక అవాకులు, చవాకులు పేలిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు నోట మాట రావట్లేదన్నారు. ఆ పార్టీలు చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. కానీ, ఏ ఒక్క చోట కూడా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేపట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు ఈ రాష్ట్రంలో ప్రజల కనీస మద్దతు లేదన్నారు. దళితులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వాళ్లు కేసీఆర్ నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఈనెల 16 తేదీన జమ్మికుంటలో జరిగే కేసీఆర్ సభకు తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా దళితులకు కొప్పుల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, నన్నపనేని నరేందర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, మాజీ చైర్మన్ రామస్వామి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు మల్లయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు స్కీం కాదు ఉద్యమం: @Koppulaeshwar1 pic.twitter.com/AV5I1RWc5g
— Namasthe Telangana (@ntdailyonline) August 9, 2021
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్