ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ : ఆధ్మాత్మికతో పాటు మానసిక ఆహ్లాదం కలిగించేలా ఆలయాల పరిసరాలను తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులపై సోమవారం అరణ్య భవన్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం, అడెల్లి పోచమ్మ, కాల్వ లక్ష్మినర్సింహా స్వామి, కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షలో చర్చించారు. వివిధ ఆలయాల్లో కొనసాగుతున్న పనులు, త్వరలో చేపట్టబోయే పనులకు సంబంధించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..ఎకో టూరిజానికి క్రమంగా పర్యాటకులు పెరుగుతున్నప్పటికి టెంపుల్ టూరిజానికి కూడా భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇసున్నారన్నారు. బాసర అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా భక్తులకు విడిది సౌకర్యం, క్యూ కాంప్లెక్స్, తాగునీరు, షాపింగ్ కాంప్లెక్స్, తదితర సౌకర్యాలు, నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించడంతో పాటు గోదావరి నదికి హరతీనిచ్చే ప్రాంతాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దడం, బోటింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బాసరలో ఆధ్యాత్మిక టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు.
బాసరలో ఇప్పటికే రూ. 8 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, బాసరతో పాటు అడెల్లి, కాల్వ, కదిలి ఆలయాల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ శిల్పుల సహకారంతో డిజైన్లు రూపొందించి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. అడెల్లి ఆలయ విస్తరణ పనులకు కావాల్సిన
భూ సేకరణకు తగిన ప్రతిపాదనలు రూపొందించి కలెక్టర్‌కు అందజేయాలన్నారు.
పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా షవర్లు (నీటీ జల్లు స్నానం) ఏర్పాటు చేయాలని, కోనేటిలో స్వచ్ఛమైన నీరు ఉండేలా చూడాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, అంతర్గత రోడ్ల విస్తరణ, పిల్లలకు ప్రత్యేక ఆట స్థలం, భక్తులకు విడిది గృహాలు, వీఐపీ గెస్ట్ రూంలు, బయో టాయ్‌లెట్స్ నిర్మించాలని సూచించారు. కాల్వ దేవస్థానంలో కోనేటిని అభివృద్ధి పరచడంతో పాటు భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆలయాల్లో భక్తులకు కల్పించే పలు సదుపాయాల కోసం దాతలు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సత్పతి శ్రీవల్లినాయగం, సీఈజీ సీతారాములు, బాసర ఈవో వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

