కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/సిర్పూర్(యు): వడదెబ్బతో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందగా, తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మం డలం ఎల్లాపటార్లో జరిగింది. ఎల్లాపటార్కు చెందిన కూలీలు శనివారం ఉ పాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యా రు. ఇందులో ఆత్రం అక్బర్ షా(33) ఆదివారం ఉదయం మరణించాడు. ఈయన భార్య తుర్పాబాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. ఉపాధి హామీ పని ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఆత్రం రాము, ఆత్రం యశోదతోపాటు మరో ఆరుగురు కూలీలు వడదెబ్బ బారినపడ్డారు.