ఓదెల, అక్టోబర్ 26 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఆదివారం తెల్లవారుజామున మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో మంచు తుఫాను కురిసింది. దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న రహదారి కూడా కనిపించక రోడ్ల వెంబడి వెళ్లే వాహన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రైల్వే మార్గంలో కూడా విపరీతంగా మంచు కురిసింది. ఈ క్రమంలో లోకోపైలట్లకు సిగ్నల్స్ సరిగా కనిపించక రైళ్ల వేగాన్ని తగ్గించి నడిపించినట్లు తెలిసింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కమ్మేసి ఉంది. ఇంటి ఎదురు ఇల్లు కూడా కనిపించనంతగా గ్రామాల్లో మంచు నిండిపోయింది. మంచు తుఫానును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వాహనదారులు ముందు హెడ్లైట్లను వేసుకొని వెళ్లాల్సి వచ్చింది. ఈ కారణంగా వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.