Cyclone Fengal | హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తేతెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.
దీని ప్రభావంతో ఈనెల 8వతేదీ వరకు తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపా రు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉద యం వేళల్లో పొగమంచు కమ్ముకుంది.