Cyber Crime | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈ ఏడాది కాలంలో సైబర్ నేరగాళ్లు రూ.1866.9 కోట్లు దోచుకున్నారు. గత సంవత్సరం రూ.778.7 కోట్లను కాజేయగా.. ఈ ఏడాది దాదాపు రెట్టింపైంది. 2023లో 91,652 సైబర్ నేరాలు నమోదైతే, 2024లో ఆ సంఖ్య 1,14,174కు చేరింది.
దీనిబట్టి తెలంగాణలో ఏడాదికాలంలో సైబర్ నేరాలు ఏవిధంగా పెరిగాయో అర్థమవుతున్నది. దేశవ్యాప్తంగా 1057 మందిని అరెస్ట్ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.