హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొరియర్ సర్వీసుల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు వీటిపై జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. బ్లూడార్ట్ వంటి ప్రముఖ కొరియర్ సంస్థల పేరుతో ఇటీవల మోసాలు పెరిగినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు.
మనం కొరియర్ చేయకపోయినా, మనకు ఎవరూ కొరియర్ పంపకపోయినా.. కొరియర్ వచ్చిందని ముగ్గులోకి దింపుతారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పకూడదని సూచించారు. *21* ఫోన్ నంబర్#వంటి కోడ్లతో డయల్ చేయవద్దని కోరారు. సైబర్ మోసాలకు గురైతే.. 1930కు కాల్ చేయాలని సూచించారు.