Cyber Crime | హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ‘ఎంజాయ్ సంక్రాంతి స్పెషల్ ఫ్రీ రీచార్జ్.. 4 జీబీ డాటా వ్యాలిడ్ టిల్ యువర్ కరెంట్ ప్యాక్ వ్యాలిడిటీ. ఆల్సో గెట్ 2 జీబీ డాటా ఆన్ యువర్ నెక్ట్స్ రీచార్జ్’ అంటూ ఓ సైబర్ మోసగాడి నుంచి ఫేక్ మెసేజ్. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మీ నంబర్‌కు బంపర్ ఆఫర్ వచ్చింది.
మీకు 10 జీబీ డా టా ఉచితంగా అందించబడుతుందిదీని కో సం మేము పంపిన లింక్‌ను క్లిక్ చేసి, మీ వివరాలు పొందుపర్చండి. ఆ తర్వాత ఆ మెసేజ్ ను 10 మందికి పంపితే మీకు పూర్తి ఉచితం గా 10 జీబీ డాటా లభిస్తుంది’ అంటూ మరో కేటుగాడి మెసేజ్. ఇలా.. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో ప్రకటనలు, మెసేజ్‌లతో అమాయకులకు వల వేసి డబ్బులు లూటీ చేస్తున్నారు. దీనిపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తమైంది.ఇలాంటి ప్రకటనలకు ఎవరూ ఆశపడొద్దని, లింకులను క్లిక్ చెయ్యొద్దని సూచిస్తున్నది.