ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా!
‘నా 32 ఏండ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాల జ్ఞాపకాలతో ప్రయాణం చేశా. అనేక కఠినమైన సవాళ్లు ఎదుర్కొన్నా..’ అని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. గురువారం తన ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అకాడమీ, డీజీపీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శివధర్‌రెడ్డి మాట్లాడారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు.
- అనుభవాల జ్ఞాపకాలతో 32 ఏండ్లు ప్రయాణించా!
- వీడ్కోలు సమావేశాల్లో డీజీపీ బీ శివధర్‌రెడ్డి
- ఆపరేషన్ కగార్ అమల్లో సఫలీకృతుడయ్యారు : సీవీ
- నేడు డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న సీవీ ఆనంద్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ‘నా 32 ఏండ్ల పోలీస్ జీవితంలో ఎన్నో సమస్యలు, ఆనందం, అనుభవాల జ్ఞాపకాలతో ప్రయాణం చేశా. అనేక కఠినమైన సవాళ్లు ఎదుర్కొన్నా..’ అని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. గురువారం తన ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అకాడమీ, డీజీపీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో శివధర్‌రెడ్డి మాట్లాడారు. తనను వెన్ను తట్టి ప్రోత్సహించిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు తెలిపారు.
1970, 1980 నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పోలీసింగ్‌లో చాలా తేడా వచ్చిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజల నమ్మకాన్ని గెలిచామని, ప్రభుత్వాల విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించినట్లు తెలిపారు. తాను ఎంతగానో ఇష్టపడే తన మాతృ రాష్ట్రానికి డీజీపీగా సేవలు అందించడం.. తన జీవితంలో మర్చిపోలేని క్షణాలని భావోద్వేగానికి గురయ్యారు. డీజీపీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. యువ పోలీసులు శాఖకు మంచిపేరు తేవాలని కోరారు. తెలంగాణకు మంచి చాలెంజింగ్ అధికారి సీవీ ఆనంద్ డీజీపీగా రాబోతున్నారని కొనియాడారు.
మావోయిజం నిర్మూలనలో కీలకం
డీజీపీగా ఉద్యోగ విరమణ పొందుతున్న శివధర్‌రెడ్డిని తాను దగ్గరగా చూశానని, సమైక్య రాష్ట్రంలో ఆయన ఎన్నో సవాళ్లు అధిగమించారని కాబోయే డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ అకాడమీలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సలిజం ప్రాబల్య ప్రాంతాల్లో శివధర్‌రెడ్డి సేవలు అందించారని, ఎన్కౌంటర్లు, మావోయిస్టుల సరెండర్లలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ తెలంగాణలో విజయవంతం కావడంలో శివధర్‌రెడ్డి పాత్ర అత్యంత కీలకమైందన్నారు. అనంతరం శివధర్‌రెడ్డిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై నిల్చోబెట్టి ఐపీఎస్ అధికారులు దానిని లాగుతూ ఆయనకు సగౌరవంగా వీడ్కోలు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

