హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న ప్రైవేట్ కళాశాలల యా జమాన్యాలు, విద్యార్థులకు నిరాశే మిగిలిం ది. సాలర్షిప్ల బడ్జెట్ కేటాయింపులు రూ.109 కోట్లు తగ్గించింది. 2026-27 బడ్జెట్లో స్కాలర్‌షిప్‌ల కోసం మొత్తం గా రూ.4,343 కోట్లు కేటాయించిం ది. గత బడ్జెట్లో కేటాయించిన 4,452 కోట్ల కంటే ఇవి రూ.109 కోట్లు తక్కవ. స్కాలర్‌షిప్‌ల కోసం 25 లక్షల మంది విద్యార్థులు ఎ దురుచూస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పది వేల కోట్లకుపైగా ఉండగా, ఆ మేరకు కేటాయించకపోగా, గత సంవత్సరం కేటాయించిన మొత్తంలోనూ కోత విధించడం గమనార్హం. గత బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసిం ది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సా యం, పునరావాసం అందించా ల్సి ఉంటుంది. గత బడ్జెట్లో రూ.35 కోట్లు కేటాయించగా, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. తాజా బడ్జెట్లో అసలు నిధులే కేటాయించలేదు. ఎస్సీ కులాంతర వివాహాల ప్రోత్సాహకాలకు పైసా విదల్చలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ను మాదిగ, మాల కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాటి ఊసెత్తలేదు. ఎస్సీ గురుకులాల మరమ్మతులకు నిధులు కేటాయించలేదు.
బీసీ సబ్‌ప్లాన్‌కు ధోకా
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా ఈసారి కూడా బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించలేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో బీసీల అభ్యున్నతి, సంక్షేమానికి రూ.20వేల కోట్ల చొప్పున కేటాయిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, ప్రస్తుత బడ్జెట్లో రూ.12,511 కోట్లు కేటాయించింది. గత సంవత్సరం రూ.11వేల కోట్లకు పైగా కేటాయించినప్పటికీ, అందులో రూ.2,500 కోట్లు కూడా విడుదల చేయలేదు.