మహబూబాబాద్ రూరల్, జూలై 22 : విద్యుత్తుషాక్‌తో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో జరిగిం ది. మంగళవారం గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహానికి ముందుభాగంలో ఉన్న రేకుల షెడ్‌కు విద్యుత్తు మరమ్మతులు చేస్తున్నారు.
8వ తరగతి విద్యార్థులు సాయికుమార్, హేమంత్, 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ లంచ్ చేసి వెళ్తుండగా రేకుల షెడ్ పైపులకు తగలగడంతో వారికి కరెంట్ షాక్ కొట్టింది. దీంతో స్వల్ప గాయాలు కావడంతో వెంటనే కేర్ టేకర్ స్థానిక ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. హేమంత్, సిద్ధార్థ చికిత్స తర్వాత ఇంటికి వెళ్లగా, సాయికుమార్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.