సిద్దిపేట, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రేవంత్ సర్కారు రెండేండ్ల పాలనలో రైతులకు మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. 24గంటల కరెంటిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టి, ప్రస్తుతం 12గంటలకు కూడా సరఫరా చేయకపోవడంతో యాసంగి సాగు కష్టమేనని రైతాంగం ఆందోళన చెందుతున్నది. కేసీఆర్ పాలనలో 24గంటలు ఫుల్ కరెంటు వచ్చేదని.. ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చాక ఎవుసం అధ్వానమైందని పేర్కొంటున్నారు.
ఒక్క విద్యుత్ విషయంలోనే కా దు కాంగ్రెస్ సర్కారు రైతులను అన్ని విధాలా దగా చేస్తున్నది. సకాలంలో ఎరువులు అం దక, పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయక రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. బోనస్ ఇస్తామని ఊదరగొట్టిన రేవంత్ ప్రభుత్వం తీరా బోనస్ ఎగ్గొట్టింది. రైతు భరోసా పత్తాలేదు. ఇలా కష్టాలతో నెట్టుకొస్తున్న రైతులకు యాసంగి సాగు ప్రారంభంలోనే కరెంట్ కష్టాలు మొదలవ్వడంతో రైతులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. నార్లు పోసి నాటు వేస్తున్న క్రమంలోనే రైతులకు కరెంట్ కష్టాలు చుక్కలు చూపిస్తున్నది.
బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పర్యటిస్తున్న క్రమంలో పలువురు రైతులు స్వయంగా కరెంట్ సమస్య చెప్పుకోవడం ఇందుకు నిదర్శనం. ఈ ప్రాం తంలోని రెడ్డిపల్లి, కాగజ్మద్దూర్ గ్రామాల రైతులు హరీశ్‌రావుకు ఫోన్ చేసి 12, 13 గంటలు మాత్రమే కరెంటు వస్తున్నదని.. జర చూడండి సారు అని విన్నవించారు. ‘రాత్రి సమయాల్లో 12గంటలకు, ఒంటి గంటకు, 2గంటలకు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు క రెంట వస్తుందని ఆవేదన చెందారు.