యాసంగి @ 52.88 లక్షల ఎకరాలు
యాసంగి సాగు ముగింపు దశకు చేరుకున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 52.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
- అత్యధికంగా 35.84 లక్షల ఎకరాల్లో వరి
- పెరిగిన పప్పు, నూనెగింజల సాగు
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): యాసంగి సాగు ముగింపు దశకు చేరుకున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 52.88 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. అత్యధికంగా వరి 35.84 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ఆ తర్వాత శనగ 3.69 లక్షల ఎకరాలు, వేరుశనగ 3.46 లక్షల ఎకరాల్లో సాగైంది. గత యాసంగితో పోల్చితే ఈ సీజన్లో మొత్తం సాగు విస్తీర్ణం సుమారుగా 14 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో ఈ సమయం వరకు మొత్తం 66.48 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ సీజన్లో 52.88 లక్షల ఎకరాల్లో సాగైంది. కేంద్ర ప్రభుత్వం యాసంగిలో తెలంగాణ నుంచి ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేయబోమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు వరి సాగు చేయొద్దని సూచించింది. దీంతో గతంతో పోల్చితే వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగిలో ఇప్పటివరకు 51.62 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా ఈ సీజన్లో మాత్రం 35.84 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గతంతో పోల్చితే ఏకంగా 15.78 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గడం గమనార్హం. ఈ ప్రభావం మొత్తం విస్తీర్ణం పెరుగుదలపై పడింది.
పప్పు, నూనె గింజల సాగు
మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పులు, నూనెగింజల సాగును ఎక్కువగా చేశారు. గత యాసంగిలో పప్పులు 4.51 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సీజన్లో 5.17 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇందులో శనగ పంట 3.48 లక్షల ఎకరాల నుంచి 3.69 లక్షల ఎకరాలకు పెరిగింది. మినుములు 47 వేల ఎకరాల నుంచి 87 వేల ఎకరాలకు పెరిగింది. నూనెగింజల సాగు గత యాసంగిలో 3.54 లక్షల ఎకరాల్లో సాగైతే ఈ సీజన్లో 4.76 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే 1.22 లక్షల ఎకరాలు పెరగడం గమనార్హం. వేరుశనగ 2.72 లక్షల ఎకరాల నుంచి 3.46 లక్షల ఎకరాలకు పెరిగింది. పొద్దుతిరుగుడు కూడా 18 వేల ఎకరాల నుంచి 38 వేల ఎకరాలకు పెరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

