హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనల ద్వారా మోసాలు దారుణంగా పెరిగిపోతున్నాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) డీజీ శిఖాగోయెల్ ఆందోళన వ్యక్తం చేశారు.
భారీ డిస్కౌంట్లు అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, గాడ్జెట్లు, ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులపై భారీ డిసౌంట్లు ఇస్తున్నట్టు సైబర్ నేరగాళ్లు స్పాన్సర్డ్ యాడ్స్ రూపొందించి ప్రజలను మోసగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.