కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు ఘనస్వాగతం లభించింది. సీఎస్‌కు, హరీశ్‌రావుకు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కర్ణన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్లో దళితబంధుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే మంత్రులు శాలపల్లి వెళ్లి సీఎం బహిరంగ సభా ఏర్పాట్లను పర్యవేక్షించే అవకాశం ఉంది.