e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home తెలంగాణ తక్షణ చర్యలు చేపట్టండి

తక్షణ చర్యలు చేపట్టండి

  • అనుక్షణం అప్రమత్తంగా ఉండండి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్‌
తక్షణ చర్యలు చేపట్టండి


హైదరాబాద్‌, జూలై 22 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం ఉదయం వరద ప్రభావిత 16 జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయాజిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్న ఆయన ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించాలని తెలిపారు. అన్నిజిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేసుకోవాలని, అవసరమైతే లో తట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాం తాలకు తరలించాలని సూచించారు. చెరువులు, నీటికుంటలకు గండ్లుపడితే తక్షణ మే పూడ్చే ఏర్పాట్లు చేయాలని, వరదప్రాంతాల్లో తాగునీరు. పారిశుద్ధ్యం, విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కోవడానికి విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జాతో నిరంతరం సంపప్రదింపులు జరుపుకోవాలని చెప్పారు.

పోలీస్‌ ఆన్‌ అలర్ట్‌..!!
వరద సహాయకచర్యల్లో పాల్గొనడంతోపాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆయాప్రాంతాల్లో పహారా పెంచేలా అన్ని జిల్లాల ఎస్పీలు తమ సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తంచేశారు. ప్రధానంగా బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద నీటి ప్రవాహం ఉధృతంగాఉన్న ప్రాం తాల్లో పోలీసులు రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూతోపాటు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తక్షణ చర్యలు చేపట్టండి
తక్షణ చర్యలు చేపట్టండి
తక్షణ చర్యలు చేపట్టండి

ట్రెండింగ్‌

Advertisement