CS Shanti kumari | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల పదోన్నతి పొంది న 30 వేల మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సమావేశమవుతారని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో నిర్వహించే సమావేశ ఏర్పాట్లపై ఆమె సోమవారం ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ జితేందర్, ఎస్సీ డెవలప్‌మెంట్‌శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి టీచర్లు ప్రతిఒకరూ హాజరు కావాలని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని మాడల్ స్కూల్ టీచర్లకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాడల్ టీచర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు 010 పద్దు కింద జీతా లు అందించాలని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శాసనమండలిలో పలుసార్లు ప్రస్తావించారు. జూనియర్ కాలేజీలలో పని చేస్తున్న పీజీటీలకు జేఎల్ స్కేళ్లు వర్తింపజేసేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.