CS Shanti Kumari | హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్ష నిర్వహించారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు.
ఉప రాష్ట్రపతి ప్రయాణించే దారుల్లో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖకు సీఎస్ సూచించారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని టీజీఎస్పీడీసీఎల్ ఎండీని ఆదేశించారు. అదే విధంగా అగ్నిమాపక శాఖ విభాగం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, ఐ అండ్ పీఆర్ శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..