CS Shanti Kumari | గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ శాంతికుమారి
CS Shanti Kumari | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
CS Shanti Kumari | హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం గోల్కొండ కోటను సందర్శించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మన సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తులలో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ తెలిపారు. గుస్సాడి, కొమ్ము కోయ, లంబాడీ, డప్పులు, ఒగ్గు డొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, భైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన వెయ్యి మందికి పైగా కళాకారులు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇస్తారన్నారు. పిల్లలలో దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ జితేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

