హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఒకేసారి 20మంది సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్‌ను సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) వైస్ చైర్మన్‌గా, జయేశ్‌రంజన్‌ను ఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ సీఈవోగా, దాన కిశోర్‌ను కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆర్వీ కర్ణన్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బదిలీ చేశారు. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితాసబర్వాల్‌ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించారు.