వాజేడు, జూలై 14 : ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బొగత జలపాతం(Bogotha Waterfall) ఆదివారం పర్యాటకులతో(Tourists )పోటెత్తింది. సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి జలపాతం అందాలను వీక్షించారు. వ్యూ పాయింట్ వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేశారు. జలపాతం ముందు భాగంలో ఉన్న స్విమ్మింగ్పూల్లో స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.
జలపాతంతోపాటు చుట్టూ పచ్చని అందాలను ఎంజాయ్ చేస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా.. ఆంధ్ర రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగ ణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో సందడి చేశారు.