Non-veg : ఓ స్కూల్లో కొంతమంది విద్యార్థులు కలిసి బీఫ్ తిన్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. దాంతో విద్యాశాఖకు చెందిన ఆ జిల్లా యంత్రాంగం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మాంసాహారంపై నిషేధం విధించింది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాం (Assam) లోని గోల్పారా జిల్లా (Golpara district) విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై పాఠశాలలకు మాంసాహార పదార్థాలు తీసుకురావద్దని గోల్పారా జిల్లా ప్రభుత్వ పాఠశాల ఇన్స్పెక్టర్ కార్యాలయం విద్యార్థులకు ఆదేశాలు ఇచ్చింది.
ఇటీవల కృష్ణాయిలోని స్కూల్లో కొందరు విద్యార్థులు బీఫ్ తిన్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నిషేధం నుంచి కోడి గుడ్లను మినహాయిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా మధ్యాహ్న భోజన సమయం లేదా విరామం సమయంలో విద్యార్థులు పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లడాన్ని కూడా గోల్పారా జిల్లా ప్రభుత్వ పాఠశాల ఇన్స్పెక్టర్ కార్యాలయం నిషేధించింది.