యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. వరుస సెలవుదినాలు రావడంతో భక్తులు దర్శనానికి క్యూకట్టారు.
స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రాకతో ఆలయ మాడ వీధులు, క్యూ లైన్లు సందడి గా కనిపించింది. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.