అల్లం: తాజా అల్లం నుంచి రసం తీసుకోవాలి. దానిని తెల్లమచ్చలపై రుద్దుకుని 10 నిమిషాలపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేసుకోవాలి.
కలబంద: కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మంపై తెల్లమచ్చలను నయం చేయడానికి సాయపడతాయి. తాజా కలబంద నుంచి గుజ్జు తీసుకోవాలి. దానిని తెల్లమచ్చలపై రుద్దుకుని, అరగంట తర్వాత కడుక్కోవాలి.
వేపాకులు: కొన్ని వేపాకులను రుబ్బి పేస్టుగా చేసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో తెల్లమచ్చలు ఉన్నచోట మర్దన చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
ఆవనూనె: ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆవనూనె తీసుకోవాలి. దానికి చిటికెడు పసుపు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తెల్లమచ్చలు ఉన్నచోట రుద్దుకుని, 15 నిమిషాలపాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి.
గ్రీన్ టీ: ఓ కప్పు నీటిని మరిగించుకోవాలి. అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను ముంచాలి. చల్లారే వరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత దూదితో గ్రీన్ టీని ప్రభావిత ప్రాంతంలో రుద్దుకోవాలి. 15 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడుక్కోవాలి.