అత్తి పండ్లు, అంజీర్, ఫిగ్స్.. ఏ పేరుతో పిలిచినా ఇవి అపారమైన పోషకాలకు నిలయం. ఈ పండ్లను డ్రైఫ్రూట్స్గానే ఎక్కువమంది ఇష్టపడతారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు.. అత్తి పండ్లను తినడంవల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె సమస్యలు రాకుండా చేస్తాయి. ఈ పండ్లలోని పోషకాలు క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
చర్మ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జింక్, ఐరన్ లోపాలను అధిగమించి కేశ సౌందర్యాన్నీ కాపాడుకోవచ్చు. నేరుగానే తినాల్సిన పన్లేదు. పాలలో కలుపుకొని తాగవచ్చు. మిఠాయిలలో చక్కెరకు బదులుగా వాడుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌కు జోడించుకోవచ్చు. సలాడ్ డ్రెస్సింగ్లోనూ ఉపయోగించుకోవచ్చు. బరువు తగ్గించుకునే
ప్రయత్నంలో ఉన్నవారు మాత్రం అంజీర్‌కు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో చక్కెర పాళ్లు ఎక్కువ.