హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సోమవారం శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకోగా 30,682 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొన్నట్టు పేర్కొన్నారు. శ్రీవారి హుండీకి రూ.4.05 కోట్లు ఆదాయం వచ్చినట్టు చెప్పారు. జనవరి 2 నుంచి 11 వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు.