Mallanna temple | మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
Harish Rao | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్త జనులతో(Devotees) కిటకిటలాడింది.
చేర్యాల, జనవరి 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna temple) ఆదివారం భక్త జనులతో(Devotees) కిటకిటలాడింది. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు. అనంతరం ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కోనేటిలో పవిత్రంగా స్నానాలు ఆచరించారు. స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు.
మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండ పైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బొనాలు సమర్పించారు. మరి కొందరు రాతి గీరల వద్ద ప్రదక్షణలు, కొడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి తమ కోరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామాంజనేయులు, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

