చిగురుమామిడి, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల పెండ్లీలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ పెద్ద మోసమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్‌లో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి దేవుళ్లపై ఒట్లుపెట్టే నాటకం ఆడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీలేదని విమర్శించారు. ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి తనను పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.