హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వచ్చే ఆదాయం అప్పు లు, వడ్డీలు, జీతాలకే సరిపోతున్నది. అందుకే వీలైనం త వరకు పొదుపు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలు పదే పదే చెప్తున్నారు. ‘పొదుపు’ మంత్రంలో భాగంగా సీ ఎం కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను తగ్గించామని ప్రభు త్వ వర్గాలు గొప్పగా ప్రకటించాయి. విలాసాలకు, అనవసర ఖర్చులకు ప్రజాధనాన్ని ఒక్కపైసా కూడా ఖర్చు పెట్టం అని డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టివిక్రమార్క శనివారం ఓ సమావేశంలో తెలిపారు. కానీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కనిపించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం పొదుపు అంటూనే దుబారా ఖర్చు చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ పేరుతో చేస్తున్న హడావుడిపై మండిపడుతున్నారు. ఇందుకు శనివారం సచివాల యం ఎదుట జరిగిన కార్యక్రమమే ఉదాహరణ. వి ద్యుత్‌శాఖ పరిధిలో 112 మందికి నియామక పత్రా లు ఇచ్చేందుకు ప్రభుత్వం సచివాలయం ముందున్న రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట ఓ కార్యక్రమం నిర్వహించింది.
భారీ వేదికతో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పాల్గొని నియామకపత్రాలు అందజేశారు. దాదాపు రూ.20 లక్షల ఖర్చయిందని ప్రభుత్వవర్గాలే చెబుతున్నాయి. ప్రజాభవన్లోనో, సచివాలయంలోనో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని ఆర్భాటంగా బయట ఏర్పాటు చేయడమేంటని ఉద్యోగసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి భారీ సభలు పెట్టి నియామకపత్రాలు పంపిణీ చేయడం పరిపాటిగా మారిందని, కొన్ని సభలకు కోట్లు ఖర్చు చేసిన ఉదాహరణలు ఉన్నాయని, ఇదేనా సర్కారు పొదుపు సూత్రమని మండిపడుతున్నారు.