MLC Dasoju Sravan | రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
MLC Dasoju Sravan | ఇష్టారాజ్యంగా భూ విక్రయాలకు పాల్పడుతూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ఇష్టారాజ్యంగా భూ విక్రయాలకు పాల్పడుతూ హైకోర్టు చేతిలో మొట్టికాయలు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు ( Criminal Cases ) నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (MLC Dasoju Sravan) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్కు ఉన్న విలువలు రేవంత్ రెడ్డికి లేవని, సీఎం వ్యవహరంరియల్ ఎస్టేట్ వ్యాపారులు సిగ్గుపడే విధంగా ఉందని విమర్శించారు. సీఎం అనే పదాన్ని తీసేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్ (Real estate broker) అని మార్చుకోవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో బెదిరించి ప్రయివేటు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు.హిల్ట్ పాలసీ దేశంలో అతి పెద్ద భూ కుంభకోణమని పేర్కొన్నారు. హిల్ట్ పేరుతో 6 లక్షల కోట్ల రూపాయల దందా చేస్తున్నారని పేర్కొన్నారు.
హిల్ట్ పాలసీపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామని హెచ్చరించడంపై మండిపడ్డారు. పేద ప్రజలు బంజారాహిల్స్లో ఉండవద్దా…? అంటూ ప్రశ్నించారు.ఏసీబీ ఆఫీసు ముందు ఉన్న భూమిని వేలానికి పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ది ప్రజా పాలన కాదు. ప్రజా దోపిడీ పాలన ని విమర్శించారు. కేంద్రం కోటా ప్రకారమే ధాన్యం కొంటామని చేసిన ప్రకటనను
రైతులు రోడ్ల మీదకు రాకముందే ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

